ఓర్‌మాక్స్.. సినిమాల రివ్యూలు, రేటింగ్‌లు ఇచ్చే ప్రముఖ సంస్థ. తాజాగా ఈ సంస్థ ఆగస్టు 2022 వరకు ఆల్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్, మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్, మోస్ట అవైటెడ్ హిందీ ఫిల్మ్స్, మోస్ట్ అవైటెడ్ తెలుగు ఫిల్మ్స్.. వంటి పలు కేటగిరీల్లో నిర్వహించిన సర్వే వివరాలు సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే మోస్ట్ పాపులర్ మేల్ అండ్ ఫిమేల్ స్టార్స్ సర్వే ప్రకారం మన హీరో, హీరోయిన్లు ఎవరు ఏ ర్యాంక్‌లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం..
మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ గోస్ టూ..
ఈ సర్వే ప్రకారం టాప్ టెన్‌లో ర్యాంకింగ్‌లో టాప్ 1గా తమిళ స్టార్ విజయ్ నిలిచారు. సెకండ్ ప్లేస్‌లో ప్రభాస్, మూడో స్థానంలో ఎన్టీఆర్, నాలుగు అల్లుఅర్జున్, 5 కేజీఎఫ్ యశ్, 6 అక్షయ్ కుమార్, 7 రామ్ చరణ్, 8 మహేశ్ బాబు, 9 సూర్య, 10వ స్థానంలో అజిత్ కుమార్ దక్కించుకున్నారు.
మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్..
ఈ కేటగిరిలో టాప్ టెన్‌లో సమంత ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. 2 ఆలియా భట్, 3 నయనతార, 4 కాజల్ అగర్వాల్, 5 దీపికా పదుకొణె, 6 రష్మిక, 7 కీర్తి సురేశ్, 8 కత్రినా కైఫ్, 9 పూజా హెగ్డే, 10వ స్థానంలో అనుష్క నిలిచారు.