ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధిక సంపద నష్టపోయిన కుబేరునిగా ఫేస్బుక్ కో-ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ నిలిచాడు. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల్లో జుకర్ 20వ స్థానంలో నిలిచాడు. 2014 తర్వాత జుకర్ ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు జుకర్ సంపదలో 71 బిలియన్ డాలర్లు(రూ.5.65 లక్షల కోట్లు) ఆవిరైపోయాయి. కంపెనీ పేరు ‘మెటా’గా మార్చి అందులో పెట్టుబడులు పెరిగాక కంపెనీ షేరు విలువ 57% నష్టపోయింది.
