కేంద్రంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఆదాయపు పన్ను శాఖలో భారీగా మార్పులు చేసింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన 86 మంది సీనియర్ అధికారులను కేంద్ర ప్రభుత్వం నిన్న సోమవారం బదిలీ చేసింది.
ఈ మేరకు సీబీడీటీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆదాయపు పన్ను శాఖలో చీఫ్ కమిషనర్ స్థాయి 86 మంది అధికారులను బదిలీ చేయగా.. పలువురు అధికారులకు పదోన్నతులు ఇచ్చింది.హైదరాబాద్ ఇన్‌వెస్టిగేటింగ్ డీజీగా సంజయ్ బహదూర్‌ను నియమించింది.
ముంబయి టీడీఎస్ విభాగం చీఫ్ కమిషనర్‌గా వసుంధర సిన్హా, విజయవాడ ఐటీశాఖ చీఫ్ కమిషనర్‌గా శ్రీపాద రాధాకృష్ణను బదిలీ చేసింది. విశాఖ ఐటీశాఖ చీఫ్ కమిషనర్‌గా శ్రీపాద రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ ఐటీశాఖ చీఫ్ కమిషనర్‌గా శిశిర్ అగర్వాల్‌గా నియమించింది.