భారత్‌లో గత 24 గంటల్లో 4,043 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ నుంచి 4,676 మంది కోలుకోగా, వైరస్‌తో తొమ్మిది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 47,379 యాక్టివ్ కేసులున్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.37శాతంగా ఉందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,45,43,089కి పెరిగింది. ఇందులో 4,39,67,340 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 5,28,370 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 2,95,894 కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.. మొత్తం 89.20 కోట్ల టెస్టులు నిర్వహించినట్లు చెప్పింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతుందన్న ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు 216.83కోట్ల డోసులు వేసినట్లు వివరించింది.