అలనాటి మహానటి సావిత్ర జీవితాంశం ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో మమ్మూటీ వారసుడు దుల్కర్ సల్మాన్. వారసుడిగా మలయాళ సినిమాల్లో తాను ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నాడు దుల్కర్. ఈ క్రమంలోనే ఈయన తెలుగులో నటించిన తాజా చిత్రం సీతారామం.
ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమాలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించగా.. సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ మెప్పించింది. రష్మిక మంధన, సుమంత్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలో నటించారు. వైజయంతీ మూవీస్ ఈ సినిమాను నిర్మించింది.హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదలైన ఘన విజయం సాధించింది అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు.
ఇదే ప్రశ్న దుల్కర్ సల్మాన్‌కు ఎదురుకావడంతో ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు.నేను సినిమాల్లోకి రాకముందే ఈ విషయంలో ఒక నిర్ణయానికొచ్చా. ఆడియన్స్ మెప్పు పొంది.. క్లాసిక్‌గా నిలిచిన సినిమాలను అస్సలు టచ్ చేయకూడదని డిసైడ్ అయ్యా. అందుకే సీక్వెల్స్, రీమేక్స్ జోలికి వెళ్లకూడదని అనుకున్నా. సీతారామం మంచి విజయాన్ని అందుకుని క్లాసిక్ సినిమాగా నిలిచింది. ఇటువంటి చిత్రాన్ని మళ్లీ టచ్ చేయకూడదని నా అభిప్రాయం. కాబట్టే సీతారామం సినిమాకు సీక్వెల్ ఉండదనే అనుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు దుల్కర్ సల్మాన్.
.