దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న ఆదివారం 5664 మంది కరోనా బారిన పడ్డారు.. నేడు సోమవారం కొత్తగా 4858 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,45,39,046కు చేరాయి.
ఇందులో 4,39,62,664 మంది కోలుకుకోగా, ఇప్పటివరకు 5,28,355 మంది మరణించారు. మరో 48,046 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 4735 మంది కోలుకోగా, 10 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.71 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని, రోజువారీ పాజిటివిటీ 2.76 శాతంగా ఉందని ప్రకటించింది. ఇప్పటివరకు 216.70 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని వెల్లడించింది.