రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి అభిషేకం, నిజపాద దర్శసేవలో పాల్గొన్నారు. అనంతం వడ్డీకాసుల స్వామికి రూ.1.5 కోట్ల విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. తర్వాత తిరుమల గోశాలను దర్శించారు. ముకేశ్‌తో పాటు ఆయన రెండో కొడుకు అనంత్ అంబానీ కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీలు గురుమూర్తి, విజయ సాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులున్నారు.
