Home / ANDHRAPRADESH / ఆలి మీద కోపం ఆడబిడ్డలపై చూపిస్తూ శాడిజం..!

ఆలి మీద కోపం ఆడబిడ్డలపై చూపిస్తూ శాడిజం..!

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి భార్యపై కోపంతో శాడిస్ట్‌గా మారాడు. కన్న బిడ్డలని చూడకుండా ఆడపిల్లల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. అంతటితో ఆగకుండా కొడుకుతో వీడియోలు తీయించి భార్యకు పంపి రాక్షసానందం పొందుతున్నాడు.

తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి చెందిన గంజి దావీదు, నిర్మల దంపతులు. వీరికి 11, 9 ఏళ్ల ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు. తాగుడుకు బానిసైన దావీదు నిత్యం భార్యతో గొడవపడే వాడు. పనికి వెళ్లేవాడు కాదు. ఇక భరించలేక ఆ ఇల్లాలు జీవనోపాధి కోసం పిల్లల్ని భర్త దగ్గర వదిలి దుబాయ్ వెళ్లింది. పిల్లలతో దావీదు పెంటపాడు వెళ్లిపోయాడు. భార్యపై అనుమానం పెంచుకున్న దావీదు ఆమె దుబాయ్‌లో ఉండడం ఇష్టం లేక ఇలా అయినా రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. చివరకు విచక్షణరహితంగా కూతుళ్లను కొడుతూ.. కత్తితో చంపేస్తానని బెదిరిస్తూ.. వారు భయంతో కేకలు వేస్తుంటే కొడుకుతో వీడియో తీయించి భార్యకు పంపుతున్నాడు. వీడియోలు చూసి తల్లడిల్లిన నిర్మల గ్రామ సర్పంచికి పంపగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న దావీదు పారిపోవడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat