కస్టమర్ ఇచ్చిన ఆర్డర్‌ను అందించడానికి ఓ డెలివరీ బాయ్ సాహసమే చేశాడు. ఆన్లైన్ యాప్ డంజో ఏజెంట్ రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌ను చేజ్ చేసి మరీ ఆర్డర్‌ను కస్టమర్‌కు అందించాడు. కస్టమర్ వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్లుగా ఎగిరి గంతేశారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెలివరీ బాయ్ డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయన సర్వీస్కుగాను ప్రమోషన్ ఇవ్వాలని కామెంట్లు పెడుతున్నారు.
Tags amazon amazon offers cancellation of trains catching train customers flipcart train train running train status Zomato Zomato App