దివంగత ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్లతో కలిసి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్లోని కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. అనంతరం ప్రభాస్, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి కుమార్తెలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కృష్ణంరాజు మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
