బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీ సందర్భంగా యువతకు ఏటా పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తే పాలక కూటమిలో చేరే విషయం ఆలోచిస్తానని ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాను గత రెండు రోజుల కిందట తాను ముఖ్యమంత్రి నితీష్‌ను కలిశానని ఆయన ధృవీకరించారు. ఈ షరతుతోనే తాను నితీష్ కుమార్ కూటమిలో చేరే విషయం పరిశీలిస్తానని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
మరోవైపు ప్రశాంత్ కిషోర్‌తో భేటీపై సీఎం నితీష్ కుమార్ కూడా బుధవారం పెదవివిప్పారు. కిషోర్‌తో భేటీ అయ్యానని, అయితే ఇది కేవలం మామూలుగా జరిగిన సమావేశమేనని, దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని అన్నారు. కిషోర్‌తో తన అనుబంధం పాత పరిచయమేనని ఆయన పట్ల తనకు ఎలాంటి కోపం లేదని చెప్పుకొచ్చారు.