భార్యను బట్టలు ఊడదీసి చితక్కొట్టడమే కాకుండా.. అడ్డొచ్చిన తన కూతుర్ని వదలకుండా చావగొట్టాడు ఓ టీచర్. అంతటితో వదిలేయకుండా నగ్నంగా వారిని వీధిలో కూర్చొబెట్టిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో చోటుచేసుకుంది.
జోధ్‌పుర్ జిల్లా ఫలోదీ పట్టణంలో కైలాశ్ సుథార్ అనే ఓ వ్యక్తి ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య మెంటల్ కండీషన్ సరిగా లేదు. దీంతో కైలాశ్ తరచూ గొడవ చేస్తూ ఏదో కారణంతో భార్యను కొడుతూ ఉంటాడు. ఈ తరుణంలోనే ఇటీవల భార్య బట్టలు ఊడేలా చితక్కొట్టాడు.అడ్డు రావడంతో కుమార్తెను కూడా చావగొట్టాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పోలీసుల దృష్టి వెళ్లడంతో కాలనీలో న్యూసెన్స్ చేస్తున్నాడన్న కేసులో కైలాశ్‌ను అరెస్టు చేశారు. బాధితురాలి వైపు నుంచి ఫిర్యాదు అందితే వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.