ఆకలేసి టైంకు అన్నం అడిగితే అమ్మ కొడుతుందని 8 ఏళ్ల బాలుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. బాలుడి ఫిర్యాదుతో షాక్ అయ్యారు పోలీసులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బీహార్ సీతామఢిలోని చంద్రిక మార్కెట్లో పోలీసుల దగ్గరకు వచ్చి ఓ బాలుడు ఏడుస్తూ నిల్చొన్నాడు. ఏమైందా అని పోలీసులు ఆరా తీస్తే.. ఆ బాలుడు నాలుగో తరగతి చదువుతున్నానని, తండ్రి పని కోసం వేరే దగ్గర ఉంటున్నాడని చెప్పాడు. అకలి వేస్తుందని అన్నం పెట్టమంటే అమ్మ తనని కొడుతుందని.. తనని సరిగా పట్టించుకోవడం లేదని చెప్పాడు. ఒక్కొసారి తానే పెట్టుకొని తింటుంటే ప్లేటు లాక్కొని విసిరేస్తుంది సార్ అని ఏడుస్తూ చెప్పాడు. ఇది విన్న పోలీసులు షాక్ అయ్యారు. తేరుకొని బాబును తీసుకొని వారి ఇంటికి వెళ్లారు. తల్లిని విచారించగా.. అలా ఏం లేదని, ఒక్కోసారి అల్లరి చేస్తే తిడుతుంటానని చెప్పింది. అనంతరం ఇద్దరిని హెచ్చరించి జాగ్రత్తలు చెప్పి పోలీసులు వెనుదిరిగారు.