తమిళనాడు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీంఎకేకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు సీ విజయభాస్కర్, ఎ స్పీ వేలుమణి ఇండ్లపై ఈ రోజు మంగళవారం విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఇద్దరు మంత్రులకు చెందిన 30 ప్రదేశాల్లో ఆ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఈ ఇద్దరిపై వేర్వేరుగా అవినీతి కేసులు రిజిస్టరై ఉన్నాయి. పుడుకొట్టై జిల్లాలోని ఇలుపురులో ఉన్నమాజీ ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్ నివాసంలో ఇవాళ తనిఖీలు జరుగుతున్నాయి. జాతీయ మెడికల్ కమీషన్‌కు విరుద్ధంగా అక్రమరీతిలో వెల్స్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌కు 2020లో అనుమతి ఇచ్చిన కేసులో విజిలెన్స్ సోదాలు జరుగుతున్నాయి.
అనుమతి విషయంలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.చెన్నై, సేలమ్, మధురై, తేని, తిరువల్లూరు పట్టణాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనూ మంత్రి విజయభాస్కర్‌పై గత ఏడాది అక్టోబర్‌లో డీవీఏసీ సోదాలు చేసింది.