సికింద్రాబాద్‌లోని రూబీ లగ్జరీ హోటల్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. తాజాగా ప్రధానిమోదీ, రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
– ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారు.
– అగ్రిప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పందించిన కేటీఆర్ మృతుల కుంటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బిల్డింగ్ ఓనర్‌పై కఠిన చర్యలు.. మహమూద్ అలీ
ఈ ఘటనపై రాష్ట్ర హోం మినిస్టర్ మహమూద్ అలీ స్పందించి విచారం వ్యక్తం చేశారు. సెల్లార్‌లో బ్యాటరీ బైక్‌లో మంటలు వ్యాపించడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. అధికంగా పొగ వ్యాప్తి చెందడంతోనే ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారని అన్నారు. సెల్లార్‌లో అనుమతి లేకుండా వాణిజ్య వ్యాపారాలు నిర్వహించారని అందుకు బిల్డింగ్ ఓనర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.