ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సౌత్ సెంట్రల్ జోన్‌లో పరిధిలో రైళ్లు దూసుకుపోనున్నాయి. ట్రైన్స్‌కు సంబంధించిన వేగాన్ని పెంచినట్లు వెల్లడించింది ద.మ రైల్వేస్. నేటి(సోమవారం) నుంచే ఈ స్పీడ్ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం గంటకు 110 కి.మీ వెళ్తున్న ట్రైన్లు ఇకపై గంటకు 130 కి.మీ వెళ్లనున్నాయి. సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్లలోని ఈ వేగం పెరుగుతుంది.
– విజయవాడ డివిజన్ పరిధి కొండపల్లి-గూడూరు, గుంతకల్ డివిజన్‌లోని రేణిగుంట-గుంతకల్ సెక్షన్లలో ట్రైన్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంచి రైళ్లను వేగవంతం చేయాలని 2020లో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇటీవల ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంచారు.
– సికింద్రాబాద్ డివిజన్‌లోని సికింద్రాబాద్-కాజీపేట-బల్లార్ష, కాజీపేట-కొండపల్లి.. విజయవాడ డివిజన్ పరిధిలోని కొండపల్లి-విజయవాడ-గూడూరు.. గుంతకల్ పరిధిలో రేణిగుంట-గుంతకల్లు-వాడి సెక్షన్లలో గరిష్ఠ వేగం 130 కి.మీ.లకు పెంచారు. ఆయా మార్గాల్లో ఇంతకు మించిన వేగంతో రైళ్లు పరుగులు తీసినా తట్టుకునేలా ట్రాక్‌లను పటిష్ఠం చేశారు.
– రైళ్ల వేగం పెంచినట్లు పలు సెక్షన్లలో ప్రకటించినప్పటికీ ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలున్న ట్రైన్‌లే ఈ స్పీడ్‌తో వెళ్లనున్నాయి. పాతతరం ఐసీఎఫ్ కోచ్‌ల సామర్థ్యం గంటకు 110 కి.మీనే.