తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి ఇంఛార్జ్, కో ఇంఛార్జ్ లు నియమితులయ్యారు. తరుణ్ చుగ్ ఇంఛార్జ్, అరవింద్ మీనన్ కో ఇంఛార్జ్ గా నియమిస్తూ బీజేపీ జాతీయ అధిష్టానం ప్రకటన జారీ చేసింది. మొత్తం 15 రాష్ట్రాలకు ఇంఛార్జ్, కో ఇంఛార్జ్‌లను నియమించింది.
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్ ను హర్యానా ఇంఛార్జ్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని పంజాబ్ ఇంఛార్జ్ నియమించింది. పశ్చిమబెంగాల్ కు బీహార్ రాష్ట్ర మంత్రి మంగళ్ పాండేను నియమించారు.