కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వ తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది. సెప్టెంబర్ 17న తాము చేసే కార్యక్రమాలను ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంచడానికి ఏకంగా ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది.
దీని కో సం ఏకంగా టెండర్లనే పిలిచింది కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ. ప్రపంచంలోని ఏ దేశ ప్రభుత్వం కూడా ట్విట్టర్‌లో ట్రెండింగ్ కోసం టెండర్లు పిలిచిన దాఖలాలు లేవు. ఒక్క మన కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలోనే ఇది సాధ్యమైంది.
సెప్టెంబర్ 17న తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న బీజేపీ.. కేంద్ర ప్రభుత్వం ద్వారా హైదరాబాద్‌లో 17 న పలు కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ ప్రయోజనం కోసం ప్రభుత్వంతో ఖర్చు పెట్టించాలని బీజేపీ నేతలు చూస్తున్నారు. దీని కోస మే ట్విట్టర్ వంటి మాధ్యమాలతోపాటు 18 రకాల అంశాలపై టెండర్లను పిలువాలని నిర్ణయించారు. ఇందులో మీడి యా ప్రమోషన్, రేడియో, టీవీల ద్వా రా ప్రచారం, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల ఏర్పాటుతోపాటు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవాలని చూస్తున్నారు.