రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఓ ప్రకటన విడుదల చేశారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. వర్షాలతో పాటు గంటకు సుమారు 40కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఆమె తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.