తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖకు ఆర్థికశాఖ ఇటీవల 529 పోస్టులను మంజూరుచేసిన నేపథ్యంలో ఆయా పోస్టులను వివిధ జిల్లాలకు విభజిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పరిషత్తు (జెడ్పీ), జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో (డీపీవో) వివిధ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో జెడ్పీ సూపరిటెండెంట్ పోస్టులు 103, జెడ్పీ సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 151, జెడ్పీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 213 ఉన్నాయి. వీటితోపాటు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 22, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 40 మంజూరు అయ్యాయి. వీటిలో కొన్నింటిని నేరుగా, మరి కొన్నింటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 34, సంగారెడ్డి, నిర్మల్, నాగర్‌కర్నూల్, మెదక్ జిల్లాలకు 27 పోస్టుల చొప్పున మంజూరయ్యాయి.