ఆసియాకప్ మధ్యలో ఉండగా మోకాలి గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై బీసీసీఐ సీరియస్ అయినట్లు తెలిసింది. దుబాయ్ సముద్ర తీరంలో సరదా సాహస క్రీడలు ఆడుతూ అతడు గాయపడ్డాడు. స్కైబోర్డు విన్యాసాలు చేయబోయిన జడ్డూ.. అక్కడ జారిపడటంతో మోకాలికి తీవ్రగాయమైంద. సర్జరీ చేసిన డాక్టర్లు విశ్రాంతి సూచించడంతో ఆసియాకప్‌కు దూరమయ్యాడు.
అయితే బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న ఆటగాడు గ్రౌండ్లో కాకుండా బయట గాయపడటంతో బీసీసీఐ అధికారులు జడేజాపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. కీలకమైన సీనియర్ప్లేయిర్.. సంబంధం లేని చోట గాయపడటం.. దీంతో టీ20 వరల్డ్‌కప్‌కు కూడా దూరం అయ్యే సూచనలు ఉండటంతో బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఈ వార్తల్లో నిజమెంతనేదానిపై క్లారిటీ లేదు.