అభం శుభం తెలియని ఆ బాలికను 30 ఏళ్లకు పైగా వయసున్న ఓ వ్యక్తి ఇచ్చి పెళ్లి చేయగా ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి కడుపులో బిడ్డతో సహా చనిపోయింది. ఈ దారుణమైన ఘటన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జరిగింది.
చల్లపల్లి మండలం పురిటిగడ్డ ప్రాంతానికి చెందిన ఓ ఎస్సీ బాలిక 7వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి మరణించడంతో బాలికను తల్లి బందరు శారదానగర్‌కు చెందిన 30 ఏళ్లు దాటిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. శారీరకంగా పూర్తిగా ఎదుగుదల లేని ఆ బాలిక ప్రెగ్నెంట్ అయింది. దీంతో ఆమె అనారోగ్యం పాలైంది. మరోవైపు డెలివరీకని పుట్టింటికి చేరుకుంది. నెలలు నిండడంతో పాటు ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా దెబ్బతినడంతో చల్లపల్లి, మచిలీపట్నంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరిస్థితి చేయిదాటిపోయిందని చెప్పడంతో విజయవాడ తీసుకెళ్లినప్పటికి కడుపులో బిడ్డ చనిపోగా బిడ్డ చనిపోయిన రెండు రోజులకు బాలిక చనిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు బాలిక మృతదేహానికి సీక్రెట్‌గా అంత్యక్రియలు చేసేశారు.