నార్మల్‌గా డాక్టర్‌కు చూపించుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే స్పందించిన డాక్టర్ వ్యక్తి ఉన్న కుర్చీలోనే అతడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డాక్టర్ స్పందనకు నెటిజన్లు ఫిదా అయి ప్రశంసలు కురిపిస్తున్నారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన అర్జున్ అద్నాయక్ అనే కార్డియాలజిస్ట్ దగ్గరకు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న ఓ వ్యక్తి నిత్యం జనరల్ చెకప్‌కు వస్తుంటాడు. రెండు రోజుల క్రితం జనరల్ చెకప్ కోసం రాగా ఉన్నట్టుండి ఆయనకు గుండెనొప్పి వచ్చింది. దీంతో ఎలాంటి చలనం లేకుండా కూర్చొన్న కుర్చీలో అలా కూలబడిపోయాడు.
గుర్తించిన డాక్టర్ వెంటనే కుర్చీలో ఉన్న అతన్ని అక్కడే సీసీఆర్ చేశాడు. కొద్ది సేపటికి ఆ వ్యక్తి మళ్లీ నార్మల్ అయ్యారు. అక్కడ సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజ్య సభ ఎంపీ ధనంజయ్ మహాదిక్ సైతం ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేసి రియల్ హీరో మనమధ్యలోనే ఉన్నారంటూ, డా.అర్జున్ అద్నాయక్ కొల్హాపూర్‌లోనే ఫేమస్ కార్డియాలజిస్ట్ అని, ఇలాంటి గౌరవనీయులకు నా అభినందనలు అని రాసుకొచ్చారు.
Post Views: 442