ఐదు సంవత్సరాలు చంచల్‌గూడ జైల్లో ఖైదీగా ఉన్న పాతబస్తీ గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్ నేడు విడుదలయ్యాడు. 2017లో నకిలీ పాస్‌పోర్ట్‌తో సౌదీ అరేబియా నుంచి వస్తూ ముంబయి ఇమ్మిగ్రేషన్ అధికారులకు దొరికిపోయాడు. దీంతో అయూబ్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. తర్వాత అయూబ్‌ను నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించగా 5 ఏళ్లు రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించాడు. అతడిపై పాతబస్తీ పరిధిలోని చాలా పోలీస్టేషన్లలో కేసులు ఉన్నాయి.