పశ్చిమబెంగాల్ కి చెందిన అధికార పార్టీ టీఎంసీ నేత.. ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. కోల్‌కతాలోని నాలుగు ప్రాంతాల్లో, అసన్‌సోల్‌లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
బొగ్గు కుంభకోణంలో మొలోయ్‌పై ఆరోపణల నేపథ్యంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనను ఈడీ ప్రశ్నించింది. కాగా, రాష్ట్రంలో బొగ్గు స్మగ్లింగ్‌పై పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని, ఆయన సతీమణి ఉజిరా నరులా బెనర్జీ, ఆమె సంబంధీకులను కూడాఈడీ విచారించింది.