వివాదస్పద వ్యాఖ్యలతో ఇటీవల జైలు పాలైన గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన భార్య ఉషాబాయి హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 25న పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడాన్ని ఆమె సవాల్ చేశారు. ఆర్టికల్ 14, 21 లకు వ్య తిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్ను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేశారనే కేసులో కోర్టు రిమాండ్కు తరలించేందుకు అనుమతించలేదని గుర్తు చేశారు.
