తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ సమావేశమైన శాసనసభ ఇటీవల మరణించిన మాజీ శాసనసభ సభ్యులకు సంతాపం తెలిపింది. తుంగతుర్తి మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ శాసన సభ్యులు పరిపాటి జనార్దన్ రెడ్డి మృతిపట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. మాజీ సభ్యుల మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు శాసనసభ సభ్యులు మౌనం పాటించారు. అనంతరం శాసన సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారంకు వాయిదా వేశారు.
