మరో ఆరు నెలల్లో రిటైర్ అవ్వనున్న 64 ఏళ్ల జడ్జి శివ్‌పాల్‌సింగ్ రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఝార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో జడ్జిగా పనిచేస్తున్నారు. భాజపా నాయకురాలు, గొడ్డా జిల్లా కోర్టు న్యాయవాది నూతన్ తివారీ (50)ని ఇటీవల ఆయన వివాహం చేసుకున్నారు. నూతన్ తివారీ మొదటి భర్త మరణించారు. న్యాయమూర్తి శివ్‌పాల్ భార్య కూడా 2006లో కన్నుమూశారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. జీవిత భాగస్వాములను కోల్పోయిన న్యాయమూర్తి, న్యాయవాది ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకుని మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్కు శిక్ష విధించిన కేసులో జడ్జి శివ్‌పాల్‌సింగ్ పేరు మార్మొగింది.