దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఈడీ దూకుడు పెంచింది. ఈరోజు ఉదయమే దేశవ్యాప్తంగా ఏకకాలంలో 32 చోట్ల తనిఖీలు చేపట్టింది. దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, గురుగ్రామ్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
హైదరాబాద్ లోని అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ సాగర్ ఇళ్లతోపాటు రాబిన్ డిస్టిలర్స్ కార్యాలయంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.