దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుతూ వస్తున్నది. గడిచిన గత 24గంటల్లో కొత్తగా 4,417 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా మహమ్మారి వైరస్ కారణంగా 22 మంది ప్రాణాలు కోల్పోయ్యారు.. కరోనా మహమ్మారి భారీన పడినారు 6,032 మంది బాధితులు కోలుకున్నారు.
కొత్తగా నమోదైన కరోనా పాజిటీవ్ కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,44,66,862కు చేరింది. ఇందులో 4,38,86,496 మంది కోలుకున్నారు. వైరస్‌తో ఇప్పటి వరకు 5,28,030 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 52,336 యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం రోజువారీ పాజిటివ్ రేటు 1.20శాతం ఉందని పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు 213.72కోట్ల కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.