తెలంగాణలోని త్వరలోనే ఉపాధ్యాయులు మంచి శుభవార్త వినబోతారని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రమోషన్లు, బదిలీ ప్రక్రియను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకే కాస్త ఆలస్యం జరుగుతోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు