అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. దసరా, దీపావళి పండగలు వస్తుండడంతో రెండు సంస్థలు పోటాపోటీగా సేల్స్ ప్రారంభించనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌ను నిర్వహించనుండగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరిట ముందుకు రానుంది. వచ్చే నెల మొదటి వారంలో దసరా ఉండగా సెప్టెంబరు నెలాఖరులోనే ఈ రెండు సేల్స్ జరగనున్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను సెప్టెంబరు 23 నుంచి 30 తేదీల్లో నిర్వహించవచ్చు. ఈసారి అమెజాన్ ఎస్‌బీఐ కార్డుదారులకు 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఒక రోజు ముందే ఈ సేల్స్‌లో పాల్గొనొచ్చు.
ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు సంబంధించి ఓ బ్యానర్‌ను సిద్ధం చేసింది. అయితే తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఐసీఐసీఐ, యాక్సెస్ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. అమెజాన్ ప్రకటించే తేదీలను బట్టి ఫ్లిప్‌కార్ట్ తేదీలను ప్రకటిస్తుంది.