కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి నాగార్జున డ్రీమ్ లాండ్ లో స్థానికంగా నెలకొన్న పలు సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంపల్లి నుండి దూలపల్లి వెళ్లే రోడ్డు అభివృద్ధి, నాలా నిర్మాణం, ప్రధానంగా మంచినీటి కనెక్షన్లు, పారిశుధ్య నిర్వహణ, వీధి ద్వీపాల వంటి సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ మేరకు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్యలు లేకుండా HMDA ఆధ్వర్యంలో కొంపల్లి నుండి దూలపల్లి మీదుగా బహదూర్ పల్లి వరకు రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనులు ఇప్పటికే జరుగుతున్నాయని చెప్పారు. రూ.13 కోట్లతో వరద నీటి సమస్య లేకుండా SNDP ఆధ్వర్యంలో నాలా నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
మంచినీటి సమస్యను నెల రోజుల్లో పరిష్కరిస్తామని అన్నారు. పారిశుధ్య నిర్వహణ, వీధి ద్వీపాల సమస్య లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, సీనియర్ నాయకులు దేవేందర్ యాదవ్, నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, నాయకులు మహేష్, యాదగిరి, మధు, రాజు, కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, వినోద్ నాగ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.