ప్రస్తుతం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న రాజేంద్రకు ఏసీబీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. గతంలో రాయదుర్గంలో ఎస్ఐగా పనిచేసిన రాజేంద్ర లంచం తీసుకుంటూ దొరికిపోయారు. 2013లో ఇర్షాద్ ఖురేషీ బైక్ను తిరిగి ఇచ్చేందుకు రాజేంద్ర రూ.10 వేలు డిమాండ్ చేశారు. దీనిపై అనీశాకు ఫిర్యాదు అందగా రాజేంద్ర లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన తీర్పును తాజాగా ఏసీబీ కోర్టు వెలువరించింది.
