పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాకు ఛార్మి నిర్మాత అని తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కోసం చాలా ఇన్వెస్ట్ చేసిన ఛార్మి ఇప్పుడు తెగ బాధ పడుతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఛార్మి తీసుకున్న ఓ షాకింగ్ నిర్ణయం వెనుక లైగర్ ఎఫెక్ట్ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించి ఈ భామ చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
చిల్ గాయ్స్.. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా.. పూరీ కనెక్ట్స్ సంస్థ మరింత దృఢంగా, ఉన్నతంగా సిద్ధమై త్వరలోనే మళ్లీ మీ ముందుకు తిరిగి వస్తుంది అని ఛార్మి ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు. మరో వైపు లైగర్ ఏం బాలేదని నెటిజన్లు ఛార్మీ, పూరీ కనెక్ట్స్ను ట్యాగ్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు.