పుదుచ్చేరిలోని కరైకల్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పరీక్షల్లో తన కూతురు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడని ఓ స్టూడెంట్‌ని కడతేర్చింది ఓ తల్లి.
కరైకల్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ మాలతిల రెండో కొడుకు మణికంఠన్ నెహ్రూనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మణికంఠన్ ఎప్పుడూ మంచి మార్కులతో టాపర్‌గా నిలిచేవాడు. ఈసారి పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. దీంతో విక్టోరియా అనే మహిళ మణికంఠన్‌కు తన కూతురు కంటే ఎక్కువ మార్కులు వచ్చాయనే అక్కసుతో కూల్‌డ్రింక్‌లో విషం కలిపి వాచ్‌మెన్ సాయంతో బాలుడికి ఇచ్చింది. స్కూలు నుంచి ఇంటికి వచ్చిన ఆ బాలుడు వాంతులు చేసుకొని, కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కూల్ డ్రింక్‌లో విష పదార్థాలు ఉన్నాయని తేలడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాల్ని అరెస్టు చేశారు.