2018లో వెలుగు చూసిన అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద స్వామి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద వైద్యసాయం కోసం సాక్షాత్తూ శ్రీలంక అధ్యక్షుడైన రణిల్ విక్రమసింఘేకి లేఖ రాశారు.
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద శ్రీలంకలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నట్లు సమాచారం.తన ఆరోగ్యం క్షీణించిందని, ఆశ్రయం కల్పించి వైద్యసాయం చేయాలని కోరుతూ భారతదేశం నుంచి పారిపోయిన నిత్యానంద ఆగస్టు 7వతేదీన ద్వీప దేశ అధ్యక్షుడికి లేఖ రాశారు.
సార్వభౌమ రాజ్యమైన శ్రీకైలాసలో వైద్యపరమైన మౌలిక సదుపాయాల కొరత ఉందని లేఖలో ప్రస్థావించారు.ఆ లేఖలో శ్రీలంకలో పెట్టుబడులు పెట్టేందుకు తాను చేసిన ప్రతిపాదనను కూడా నిత్యానంద ప్రస్థావించారు.కిడ్నాప్ ఆరోపణలపై గుజరాత్ పోలీసులు అతని ఇద్దరు శిష్యులను అరెస్టు చేసిన తర్వాత 2018 నవంబర్‌లో నిత్యానంద భారతదేశం నుంచి పారిపోయారు.నిత్యానందకు అందించే వైద్యచికిత్సకు ఖర్చులను తాము భరిస్తామని ఆ లేఖలో కైలాస దేశ మంత్రి పేర్కొన్నారు.