కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని రావి నారాయణరెడ్డి నగర్ ఫేస్-2 కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తమ కాలనీలో సుమారు కోటి రూపాయలతో నూతనంగా సీసీ రోడ్డు అభివృద్ధి చేయించిన సందర్భంగా కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కాలనీల అభివృద్ధికి ఎల్లవేళలా ముందుంటానని అన్నారు.
నిధులకు కొరత లేకుండా ప్రతీ కాలనీ, బస్తీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నర్సింహా మూర్తి, జనరల్ సెక్రెటరీ ఏ.శ్రీనివాస్, ట్రెజరర్ దుర్గారావు, కమిటీ సభ్యులు మల్లేష్, శ్రీకాంత్, లోకనాధం, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.