జార్ఖండ్‌లోని దియోఘఢ్ ఎయిర్‌పోర్ట్‌లో నిబంధనలకు విరుద్ధంగా తమ చార్టర్డ్ విమానం టేకాఫ్‌కు అనుమతించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ సహా ఏడుగురు ఇతరులపై కేసు నమోదైంది.
ఎయరి్‌పోర్ట్ డీఎస్‌పీ సుమన్ అనన్ ఫిర్యాదు ఆధారంగా బీజేపీ నేతలపై కేసు నమోదైంది. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడంతో పాటు నిబంధనలను అతిక్రమించినందుకు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.