పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. ఆ మాట వింటే చాలు కుర్రకారు పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. యూత్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పవర్‌స్టార్ ఈ స్టేజ్‌కు రావడం అంత ఈజీగా అవ్వలేదు. ఒక టైంలో పవన్ కల్యాణ్ సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించారట. ఇంతకీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా..
పవర్‌స్టార్‌కు చిన్నతనంలో ఎప్పుడూ బాగుండేది కాదట. ఆస్తమా ఉండేది. అందుకే పవన్ కల్యాణ్ అంత హుషారుగా ఉండేవారు కాదు. స్నేహితులు తక్కువే. ఉన్న ఇద్దరో ముగ్గురో ఉన్నా వారి ఆలోచనలు పవర్ స్టార్ ఆలోచనలు భిన్నంగా ఉండడంతో ముచ్చట్లు తక్కువే. చిన్నతనం నుంచి పవన్ చదువులో వెనుకుండేవారు. అలాగే ఇంటర్‌లో ఫెయిల్ అయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఏమైనా అంటారు అనుకుంటే వారు ఏం అనలేదు. ఇంకా ఎంకరేజ్ చేసేవారు. స్నేహితులు అంతా ముందుకెళ్తుంటే నేను మాత్రం ఉన్న చోటే ఉన్నా ఏంటా అని ఎందుకిలా అవుతోంది తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఆసమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు పవన్ కల్యాణ్. కుటుంబ సభ్యులు చూడడంతో బతికి బయట పడి ఇప్పుడు ఇంత క్రేజ్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు.