తెలంగాణలో సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వారికీ రూ.3లక్షలు పంపిణీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం దసరా పండుగ తర్వాత ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
కరోనాతో గత రెండేళ్లుగా రాష్ట్రానికి ఆదాయం తగ్గడం వల్ల ఈ పథకాన్ని ప్రారంభించలేకపోయాం . దసరా తర్వాత నిధులు ఇవ్వాలని నిర్ణయించాం’ అని గజ్వేల్ (మ) శేరిపల్లి గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభించిన అనంతరం మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు.