కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని చంద్రానగర్ లో కాలనీవాసుల సౌజన్యం రూ.5 లక్షలు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు రూ.2 లక్షల ఆర్థిక సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారు, బాలానగర్ ఏసీపీ గంగారాం గారితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో అనేక లాభాలున్నాయన్నారు. నేరాలను అదుపు చేయడంతో పాటు రాత్రిపూట దొంగతనాలను నివారించవచ్చని, వాహనాల రాకపోకలను గుర్తించవచ్చన్నారు. అసాంఘిక శక్తుల అరాచకాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు.
సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యే వీడియో ఫుటేజ్ ల ద్వారా పోలీసులు ముఖ్యమైన కేసులు ఛేదించవచ్చన్నారు. సీసీ కెమెరాలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నందున కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతీ కాలనీ సంక్షేమ సంఘాలు వాటి ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాలనీల అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్, సంక్షేమ సంఘం అధ్యక్షులు సి.శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ, సలహాదారులు డేగ కృష్ణ మూర్తి, ప్రతాప్ రెడ్డి, సభ్యులు కె.సూర్య ప్రకాష్, సత్యనారాయణ, రామకృష్ణ, నాగరాజ్, వీరారెడ్డి, వార్డు మెంబర్ మెహరున్నీసా బేగం, శోభా, తిరుమల రెడ్డి, రామ్ బాబు, నర్సింహా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, శేషగిరి రావు, గణేష్, భాస్కర్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.