మెగాస్టార్ చిరంజీవి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఇదే సమయంలో దర్శకుడు కొరటాల శివను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన కంటెంట్‌తో సినిమాలు తీస్తే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు.
అందుకు నిదర్శనం ‘బింబిసార’, ‘సీతా రామం’, ‘కార్తికేయ 2’ చిత్రాలే. మంచి కంటెంట్‌తో వచ్చిన ఆ సినిమాలు ఇండస్ట్రీకి ఊపిరిపోశాయి. మంచి సినిమా ఇస్తే వస్తారు.. లేదంటే రెండో రోజే సినిమా పోతుంది. ఆ బాధితులలో ఈ మధ్యకాలంలో నేను కూడా ఒకడినయ్యాను. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్లు.. ప్రేక్షకులకు ఏది అవసరమనేది గమనించి.. కథల మీద దృష్టి పెట్టాలి.
ముందు మీరు ప్రేక్షకుడిగా భావించి.. ఏముందని ఈ సినిమా చూడాలని ప్రశ్నించుకోండి. డేట్స్ క్లాష్ అవుతున్నాయి అని కంగారు కంగారుగా షూటింగ్స్ చేయవద్దు. మీపై ఎందరో ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకోండి. కంటెంట్ విషయంలో డైరెక్టర్ అనే వాడు.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా చేసిన రోజున ఇండస్ట్రీకి ఎక్కువ శాతం హిట్సే వస్తాయి..’’ అని అన్నారు.