కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని వసంత నగర్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మెట్రోకేర్” హాస్పిటల్ ను ఈరోజు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు గారు మరియు కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
