ఇది నిజంగా ఎంతో అమితంగా బంగారాన్ని ఇష్టపడే ప్రియులకు శుభవార్త. దేశంలో గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్(Bullion market)లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గడంతో ప్రస్తుతం రూ.47,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పసిడిపై 10 గ్రాముల రూ.270 తగ్గడంతో రూ.51,270 ఉంది. వెండి ధరలు కూడా దిగొచ్చాయి. గురువారం బులియన్ మార్కెట్ లో కిలో వెండి రూ.50,800కే లభిస్తోంది.
