పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమాపై భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది. ఈ మూవీపై ప్రముఖ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన పూరీ జగన్నాథ్ అభిమాని అని, పూరీ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని కానీ లైగర్ ట్రైలర్ చూడగానే మూవీ మీద ఇంట్రస్ట్ పోయిందని చెప్పుకొచ్చారు. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని చిత్రబృందాన్ని ఉద్దేశించి అన్నారు. మన యాక్షన్ మీదే ప్రేక్షకుల రియాక్షన్ ఉంటుందని ఆయన తెలిపారు. సినిమా అనే కాకుండా ఏ విషయంలోనూ ఓవర్ యాక్షన్ చేయకూడదని అలా చేస్తే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయని హితువు పలికారు. గర్వం ఉండకూడదని, మేము ఎంతో కష్టపడి సినిమా తీశాము. మా సినిమా చూడండి అంటూ చిత్రబృందం ప్రమోట్ చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. అంతేకానీ నువ్వు చిటికెలు వేస్తే ప్రేక్షకులు ఇలాంటి జవాబే చెప్తారని అన్నారు తమ్మారెడ్డి.