అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ భారీ నష్టాన్ని ఎదుర్కొంది. ఈ మూవీతో తన ఖాతాలో డిజాస్టర్ వేసుకున్న అమీర్ దీనివల్ల చాలా నష్టాలనే భరిచాల్సి వచ్చింది. ఈ సినిమాకు సహ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నందుకు అమీర్‌కు లాస్ రాగా, తాజాగా హీరోగా తనకు రావాల్సిన రెమ్యునరేషన్‌ను వదులుకోనున్నాడు అమీర్ ఖాన్. అంతేకాకుండా కెరీర్ పరంగా లాల్ సింగ్ చడ్డా కోసం నాలుగేళ్ల వేరే ఏ ప్రాజెక్టులు అంగీకరించలేదు అమీర్. దీనికోసం విక్రమ వేద వంటి సినిమాలను కూడా వదులుకున్నాడు. మొత్తానికి లాల్ సింగ్ చడ్డా వల్ల అమీర్ ఖాన్‌కు రూ.100 కోట్ల నష్టం వాటిల్లింది.