సీనియర్ హీరో సుమన్ యూట్యూబ్ ఛానెల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాలేదని ఆయన చనిపోయాడంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తెగ ప్రచారం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన సుమన్.. తాను క్షేమంగా ఉన్నానని.. అభిమానులు ఎవరూ కంగారు పడొద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఆయన ఇందుకు సంబంధించిన ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రసారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సదరు యూట్యూబ్ ఛానెల్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు హీరో సుమన్.