తిరుపతి వెళ్లే భక్తులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వినాయక చవితి కానుకగా ఆగష్టు 31, సెప్టెంబరు 1(రేపు, ఎల్లుండి) రెండు ప్రత్యేక రైళ్లను తెలుగు ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. ఈ స్పషల్ ట్రైన్లు సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ మధ్య తిరగనున్నాయని రైల్యే శాఖ పేర్కొంది.
టైమింగ్స్ ఇవే..
స్పెషల్ ట్రైన్ నెం. 07120 రేపు ఆగష్టు 31న సాయంత్రం 6.15కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి సెప్టెంబరు 1 ఉదయం 8.45కు తిరుపతి చేరుకుంటుంది. అటునుంచి ట్రైన్ నెం.07121 అదే రోజు రాత్రి 9.10కి బయలు దేరి 2వ తేది ఉదయం 9.30కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ స్టేషన్ల మీదగా..
ఈ స్పెషల్ ట్రైన్ బేగంపేట, వికారాబాద్, తాండూర్, రాయచూర్, మంత్రాలయం రోడ్డు, గుంతకల్, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.