తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు .. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. నిన్న సోమవారం పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ ను వదిలేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరిగితే నేను పాదయాత్రను విరమిస్తాను అని అన్నారు.
సెప్టెంబర్ నెల పన్నెండో తారీఖు నుండి నేను నాలుగో విడత యాత్ర చేయాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ తన పాదయాత్ర తేది.. సమయం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కొట్లాటలు వద్దు అని ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చెప్పాలి కానీ ఇతర పార్టీల మధ్య గొడవలు.. వర్గాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.